WPI | టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం మెరుగైంది. నవంబర్లో 0.32శాతం పెరిగింది. అంతకు ముందు నెల అక్టోబర్లో -1.21శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్లో ఈ రేటు 2.16శాతంగా నమోదైంది. నెలవారీ ప్రాతిపదికన పప్పులు, కూరగాయల వంటి ఆహార పదార్థాల ధరలు పెరగడంతో టోకు ద్రవ్యోల్బణంలో కొంత మెరుగైంది. నవంబర్ 2025లో ద్రవ్యోల్బణం ప్రతికూల స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం ఆహార పదార్థాలు, ముడి పెట్రోలియం, సహజ వాయువు, ప్రాథమిక లోహాల నిర్మాణం, విద్యుత్ ధరలు తగ్గడమే అని పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
టోకు ధరల సూచీ (WPI) టోకు స్థాయిలో వస్తువుల ధరల్లో సగటు మార్పును సూచిస్తుంది. నవంబర్లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 4.16 శాతంగా ఉండగా.. అక్టోబర్లో ఇది 8.31 శాతంగా ఉంది. నవంబర్లో కూరగాయలలో ద్రవ్యోల్బణం 20.23 శాతంగా ఉండగా.. అక్టోబర్లో ఇది 34.97 శాతంగా ఉంది. నవంబర్లో పప్పుధాన్యాల్లో ద్రవ్యోల్బణం 15.21 శాతంగా ఉండగా.. బంగాళదుంప, ఉల్లిపాయల్లో వరుసగా 36.14 శాతం, 64.70 శాతంగా నమోదైంది. తయారీ ఉత్పత్తుల విషయంలో అక్టోబర్లో 1.54 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం నవంబర్లో 1.33 శాతానికి తగ్గింది. ఇంధనం, విద్యుత్ ధరలు అక్టోబర్లో 2.55 శాతంతో పోలిస్తే, 2.27 శాతం ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదైంది. గత వారం విడుదలైన గణాంకాల ప్రకారం.. పెరుగుతున్న ఆహార ధరల కారణంగా నవంబర్లో సీపీఐ రికార్డు కనిష్ట స్థాయి 0.25 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 0.71 శాతానికి చేరింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ వడ్డీ రేట్లను 1.25 శాతం పాయింట్లు తగ్గించింది. ఈ నెల ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను అంతకుముందు 2.6 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం వేగంగా తగ్గుతూనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పర్యవేక్షించడం ద్వారా వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ కీలక పాలసీ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు కోత విధించి 5.25 శాతానికి తగ్గించింది. గత వారం రిజర్వ్ బ్యాంక్ 2026 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచింది. భారత్ సెప్టెంబర్ త్రైమాసికంలో 8.2 శాతం, జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి చెందింది.