సరిహద్దుల్లో యథేచ్ఛగా చైనా నిర్మాణాలు
సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు, ఉద్రిక్తతల తగ్గింపునకు తగిన చర్యలు తీసుకొంటామని చెబుతున్న చైనా.. ఇదే సమయంలో అక్సాయిచిన్ రీజియన్‌లో మిలటరీ స్థావరాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నది.
- తాజా శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు, ఉద్రిక్తతల తగ్గింపునకు తగిన చర్యలు తీసుకొంటామని చెబుతున్న చైనా.. ఇదే సమయంలో అక్సాయిచిన్ రీజియన్‌లో మిలటరీ స్థావరాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నది. దీనికి సంబంధించి అమెరికాకు చెందిన మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలతో ఇండియా టుడే ఓ కథనం వెలువరించింది. 2021, డిసెంబర్ నాటి అక్సాయ్‌చిన్ రీజియన్ చిత్రాలను, ఈ ఏడాది ఆగస్టు 18న అదే రీజియన్‌లో పలు నిర్మాణాలతో కూడిన చిత్రాలను ప్రచురించింది.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) చేపట్టిన దీర్ఘశ్రేణి నిఘా రాడార్లతో కూడిన మిలటరీ సదుపాయాల విస్తరణ, అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ, దాదాపు 250 హెక్టార్ల విస్తీర్ణంలో రహదారులు, నిర్మాణంలో ఉన్న పలు నిర్మాణాలు మాక్సర్ శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నిర్మాణాలన్నీ ఎల్ఏసీకి 65 కిలోమీటర్ల పరిధిలో ఉండటం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

