న్యూఢిల్లీ: ప్రపంచ పాస్‌పోర్ట్ సూచీ(జీపీఐ) అయిదో ఎడిషన్‌లో భారత పాస్‌పోర్ట్ నిరుడుతో పోలిస్తే ఒక స్థానం దిగజారి 125వ ర్యాంక్ పొందింది. గ్లోబల్ సిటిజెన్ సొల్యూషన్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం ఒక పాస్‌పోర్ట్ మొత్తం విలువను ప్రపంచవ్యాప్త ప్రయాణం, పెట్టుబడి సామర్థ్యం, జీవన నాణ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని 197 దేశాలకు ఈ ర్యాకింగ్స్‌ను ఇచ్చారు. స్వీడన్ పాస్‌పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది.
మెరుగైన ప్రయాణ సూచీలో భారత్ 136వ ర్యాంక్‌ను, జీవన నాణ్యత సూచీ లో 118వ ర్యాంక్‌ను, పెట్టుబడి సూచీలో 94వ ర్యాంక్‌ను పొంది ంది. పెట్టుబడి సూచీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడులకు, వ్యాపార అవకాశాలకు ఏ మేరకు గమ్యస్థానం కాగలదనేది వివరిస్తుంది. భారత పాస్పోర్టుతో 26 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చని నివేదిక తెలిపింది. అయితే ఇప్పటికీ భారత పౌరులు 88 దేశాలను సందర్శించాలంటే వీసా అవసరమని వెల్లడించింది.