న్యూఢిల్లీ: ప్రతియేటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్(ఐఈపీ) విడుదల చేసే ‘గ్లోబల్ పీస్ ఇండెక్స్'(జీపీఐ)లో భారతదేశం ర్యాంకు గత ఏడాది కన్నా మరింత దిగజారింది. భారత్ నిరుడు 115వ ర్యాంకులో ఉండగా, ఈసారి 127కు పతమైంది. ఐఈపీ నిర్దేశించిన భద్రత, శాంతి ప్రమాణాల ఆధారంగా 163 దేశాలకు ర్యాంకులు కేటాయిస్తారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా మళ్లీ ఐస్లాండ్ నిలిచింది.
ప్రపంచంలోని తొలి పది అత్యంత శాంతియుత దేశాల జాబితాలో ఐస్లాండ్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియా, ఐర్లాండ్, ఆస్ట్రియా, పోర్చుగల్, సింగపూర్, ఫిన్లాండ్, జపాన్ ఉన్నాయి. ఈ ఏడాది 1.61 స్కోరు తో ఐస్లాండ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2008 నుంచి గడచిన 19 ఏండ్లుగా ఇస్లాండ్ తన స్థానాన్ని కాపాడుకోవడం విశేషం.