న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి రాసిన కొత్త పుస్తకం త్వరలో మార్కెట్లోకి రిలీజ్‌కానున్నది. 10 ఫ్లాష్ పాయింట్స్, 20 ఇయర్స్.. నేషనల్ సెక్యూర్టీ సిచ్యువేషన్స్ దట్ ఇంపాక్టెడ్ ఇండియా అన్న టైటిల్‌తో ఆయన కొత్త బుక్‌ను రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో ముంబై ఉగ్రదాడులు గురించి ప్రస్తావించారు. 2008, సెప్టెంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడులు తర్వాత పాకిస్థాన్‌పై శరవేగంగా చర్యలు తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యంత హేయంగా ఉగ్రవాదులు వందలాది మందిని హతమార్చాని, అలాంటప్పుడు ఎటువంటి సందేహం లేకుండా పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాల్సి ఉండే అని మనీష్ తివారి తన పుస్తకంలో రాశారు. మాటల కన్నా తీవ్ర స్థాయిలో పాకిస్థాన్‌పై ప్రతి దాడి చేస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాల్లో ఇండియా ఎదుర్కొన్న జాతీయ భద్రతా అంశాలను ఆయన తన పుస్తకంలో వెల్లడించారు. రూపా బుక్స్ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది. ఇటీవల మరో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్సీద్ అయోధ్యపై ఓ పుస్తకం రాశారు. దాంట్లో ఆయన హిందుత్వను ఇస్లామిక్ ఉగ్రవాదంతో పోల్చారు.