Internet Shutdown | అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే భారత్లోనే అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్డౌన్ విధించారు. తాజా ర్యాంకింగ్స్లో మన దేశం రెండో స్థానంలో ఉండగా, సైనిక పాలనలో ఉన్న మయన్మార్ మొదటి స్థానంలో ఉన్నది.
ఇక ప్రజాస్వామ్య దేశాల పరంగా చూస్తే భారత్ మొదటి స్థానంలో ఉన్నది. 2023లో మన దేశంలో విధించిన 113 షట్ డౌన్లతో పోలిస్తే నిరుడు వాటి సంఖ్య తగ్గినప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని నివేదిక వెల్లడించింది.
2018 నుంచి 2023 వరకు ఈ ర్యాకింగ్స్లో మన దేశం మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.
మణిపూర్ – 21
హర్యానా – 12
జమ్ము కశ్మీర్ – 12
2024లో 54 దేశాల్లో మొత్తం షట్ డౌన్లు – 296
2023లో 39 దేశాల్లో మొత్తం షట్ డౌన్లు – 283