న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తున్నది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 387 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 7,286 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 77,032 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 4,79,520కి చేరింది. దేశంలో 141.01 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులు తీసుకున్నారు.
దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 415కు చేరింది. ఇందులో 115 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 108 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 79, గుజరాత్లో 43, తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, రాజస్థాన్లో 22, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానాలో 4 కేసుల చొప్పున, జమ్మూకశ్మీర్, బెంగాల్లో 3 కేసుల చొప్పున, ఉత్తరప్రదేశ్లో రెండు, చండీగఢ్, లడఖ్, ఉత్తరాఖండ్లో ఒక్కో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.
India reports 7,189 new #COVID19 cases, 7,286 recoveries, and 387 deaths in the last 24 hours.
— ANI (@ANI) December 25, 2021
Active cases: 77,032
Total recoveries: 3,42,23,263
Death toll: 4,79,520
Total number of #Omicron cases 415
Total Vaccination: 141.01 Cr pic.twitter.com/BLiT1E5rjZ