India Corona | దేశంలో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 157 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,496కి చేరినట్లు తెలిపింది. ఇక గత 24 గంటల వ్యవధిలో రెండు మరణాలు నమోదైనట్లు పేర్కొంది. ఛత్తీస్గఢ్లో ఒకరు, ఉత్తరప్రదేశ్లో ఒకరు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.00 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,87,937) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Droupadi Murmu | మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. VIDEO
Indian Student | అమెరికాలో భారత సంతతి విద్యార్థి అనుమానాస్పద మృతి.. ఏడాదిలో ఐదో ఘటన