న్యూఢిల్లీ, జనవరి 6: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. శనివారం రికార్డు స్థాయిలో 774 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో క్రియాశీల కేసుల సంఖ్య 4,187కు చేరుకుంది. తమిళనాడు, గుజరాత్లలో ఒక్కో మర ణం నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది.
రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య డిసెంబర్ 5 వరకు రెండంకెల్లో మాత్రమే నమోదయ్యేవి. అయితే శీతాకాలం కారణంగా వాతావరణంలో చల్లదనం పెరగడం, కొత్త కొవిడ్ వేరియంట్ జేఎన్.1 కారణంగా రోజువారీ కేసుల సంఖ్య మూడంకెలకు చేరుకుంది. డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో ఒకే రోజు 841 కేసులు నమోదయ్యాయి.