న్యూఢిల్లీ, జనవరి 12: అల్జీమర్స్ లేదా క్యాన్సర్‌తో పోలిస్తే డయాబెటిస్ వ్యాధే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆర్థిక భారాన్ని సృష్టిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. డయాబెటిస్ కారణంగా అత్యధిక ఆర్థిక భారాన్ని మోస్తున్న ప్రపంచ దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది. భారత్ 11.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారాన్ని భరిస్తుండగా ప్రపంచంలో అత్యధికంగా అమెరికా 16.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారాన్ని భరిస్తున్నది. 11 ట్రిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానంలో ఉన్నది.
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐప్లెడ్ సిస్టమ్స్, ఆస్ట్రియాలోని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్‌కు చెందిన పరిశోధకులు 204 దేశాల్లో 2020 నుంచి 2050 వరకు డయాబెటిస్ ఆర్థిక ప్రభావంపై లెక్కలు వేశారు. కుటుంబ సభ్యులు తీసుకునే సంరక్షణను మినహాయించి డయాబెటిస్ కోసం ఏటా ప్రపంచవ్యాప్తంగా 10 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుండగా ఇది ప్రపంచ వార్షిక దేశీయ స్థూల ఉత్పత్తి(జీబీపీ)లో 0.2 శాతంగా ఉన్నట్లు నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక పేర్కొన్నది.