న్యూఢిల్లీ, జూన్ 7: దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని కరోనా మొదలైనప్పటి నుంచీ వైద్యాధికారులు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు కరోనాతో ఎక్కువ ప్రభావితమై ఇబ్బందులు పడ్డారు. కరోనా మరణాల రేటు కూడా మధుమేహం సోకిన వారిలోనే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో డయాబెటిస్ ఉన్న వారు కరోనా విషయంలో మరింత జాగ్రత్త పాటించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) విడుదల చేసిన మార్గదర్శకాల్లో సూచించింది.
ప్రతి ఆరుగురిలో ఒకరు మనోళ్లే..
గత మూడు దశాబ్దాల్లో దేశంలో డయాబెటిస్ బారిన పడినవారి సంఖ్య 150% పెరిగిందని ఐసీఎంఆర్ పేర్కొన్నది. 20 ఏండ్ల లోపు వయసుండి టైప్-1 మధుమేహం సోకిన వారు ప్రపంచవ్యాప్తంగా 11 లక్షల మంది ఉన్నారు. ఏటా 1.3 లక్షల మంది కొత్తగా దీని బారిన పడుతున్నారు. డయాబెటిస్ నిర్ధారణ అవుతున్న వయస్సు కూడా తగ్గడం ఆందోళన కలిగిస్తున్నదని ఐసీఎంఆర్ పేర్కొన్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 25-34 ఏండ్ల వయసున్న వ్యక్తులకు టైప్-2 మధుమేహం సోకుతున్నదని వెల్లడించింది.
టైప్-1 డయాబెటిస్ అంటే?
క్లోమం నుంచి ఇన్సులిన్ విడుదల ఆగిపోవడం లేదా తగ్గిపోవడం వల్ల టైప్-1 డయాబెటిస్ వస్తుంది. గ్లూకోజ్ స్థాయిలు రక్తంలో పెరుగుతాయి. జన్యుపరంగా కూడా ఈ వ్యాధి సోకుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చని ఐసీఎంఆర్ మార్గదర్శకాల్లో సూచించింది.
మధుమేహ భారత్..
150
దేశంలో గత 30 ఏండ్లలో డయాబెటిస్ కేసుల పెరుగుదల
2ంలో చైనా
11
దేశంలో ప్రతి 11 మంది భారతీయుల్లో ఒకరికి డయాబెటిస్
6
ప్రపంచంలోని ప్రతి ఆరుగురు మధుమేహుల్లో ఒకరు భారతీయులు
2
దేశంలో మొత్తం మరణాల్లో డయాబెటిస్ వాటా 46.3కోట్లు
ప్రపంచవ్యాప్తంగామధుమేహుల సంఖ్య 17.5శాతం