శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 12:17:29

విమాన‌యాన‌శాఖ‌కు 12వేల కోట్ల రిలీఫ్ ప్యాకేజీ

విమాన‌యాన‌శాఖ‌కు 12వేల కోట్ల రిలీఫ్ ప్యాకేజీ

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌తో కకావిక‌ల‌మైన విమాన‌యాన‌ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది.  విమాన‌యాన శాఖ‌ను ఆదుకునేందుకు సుమారు 12వేల కోట్ల ప్యాకేజీని కేటాయించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ది.  వైమానిక శాఖ‌పై ఉన్న ప‌లు ర‌కాల ప‌న్నుల‌ను ర‌ద్దు చేయాల‌ని కూడా ఆర్థిక శాఖ ఆలోచిస్తున్న‌ది. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైమానిక సేవ‌ల‌కు పెను విఘాతం ఏర్ప‌డింది.  ఎయిర్‌లైన్స్‌ను కాపాడుకోవాలంటే 200 బిలియ‌న్ల డాల‌ర్ల బెయిల్ ఔట్ ప్యాకేజీ అవ‌స‌ర‌మ‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేష‌న్ ప్ర‌తిపాదించింది. 


logo