న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: భారత ప్రభుత్వం మరోసారి డిజిటల్ ఏరివేతను చేపట్టింది. చైనాకు చెందిన 119 యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ యాప్‌లలో చాలా వరకు వీడియో, వాయిస్ చాట్ ప్లాట్‌ఫామ్‌లే ఉన్నాయి.
జాతీయ భద్రతకు, సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమిస్తున్న ఈ యాప్‌లపై తాజా నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2020లో కూడా టిక్ టాక్, షేరిట్ వంటి పాపులర్ యాప్‌లను భారత్ నిషేధించింది.