Visa Services | కెనడాలో వీసా సేవలను నిలిపివేసిన భారత్
భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో కెనడియన్లకు వీసా సేవలను (Visa Services) భారత్ గురువారం నిలిపివేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
న్యూఢిల్లీ : భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో కెనడియన్లకు వీసా సేవలను (Visa Services) భారత్ గురువారం నిలిపివేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిర్వహణ పరమైన కారణాలతో సెప్టెంబర్ 21 నుంచి భారతీయ వీసా సేవలు తదుపరి నోటీసులు వెలువడే వరకూ నిలిచిపోయాయని కెనడియన్ల వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు నియమించిన ప్రైవేట్ ఏజెన్సీ బీఎల్ఎస్ తన వెబ్సైట్లో పేర్కొంది. కాగా, కెనడియన్ల వీసా సేవల నిలిపివేతను భారత్ అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినడంతో కెనడాలో భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తమ పౌరులకు భారత్ మార్గదర్శకాలకు జారీ చేసింది.
ఇక కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల అంశాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న భారత్ పిలుపు పట్ల ఆ దేశ ప్రభుత్వం ఉదాసీనత కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినట్లు తెలిపింది. దీంతో కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ ప్రేరేపిత, ద్వేషపూరిత నేరాలు, హింస పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక ఎజెండాను వ్యతిరేకించే భారత పౌరులకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో కెనడాలోని భారత పౌరులు, విద్యార్థులు, ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని భారత పౌరులను కోరింది. ఈ మేరకు బుధవారం సూచనలు జారీ చేసింది. ఒట్టావాలోని భారత హైకమిషన్ వెబ్సైట్ ప్రకారం కెనడాలో 2,30,000 మంది భారతీయ విద్యార్థులు, 7,00,000 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు అంచనా.
Read More :
Emergency Alert | మీ మొబైల్స్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా..? ఆందోళన చెందకండి, ఎందుకంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

