న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాదులు నేపాల్‌లో ఉన్నట్లు భారత్ నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఇరు దేశాలకు చెందిన సైనికులు అలెర్ట్ అయ్యారు. ఇండో, నేపాల్ బోర్డర్లో సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్, పెట్రోలింగ్ నిర్వహించారు. (India, Nepal hold military drill) భారత్‌కు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), నేపాల్ సాయుధ పోలీసు దళం (ఏపీఎఫ్) ఈ మిలిటరీ డ్రిల్‌లో పాల్గొన్నారు. భారత్, నేపాల్ అంతర్జాతీయ సరిహద్దులోని నో మ్యాన్స్ ల్యాండ్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత పాక్ ఉగ్రవాదుల కోసం వెతుకున్నారు.
కాగా, నేపాలీ దళాలతో తమకు మంచి సంబంధాలున్నాయని ఎస్ఎస్బీ కమాండెంట్ గంగా సింగ్ తెలిపారు. ప్రతి నెలా రెండు దేశాల సరిహద్దు దళాల మధ్య సమన్వయ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. నేపాల్గంజ్లో ఒక మర్కజ్ ఉందని, పాకిస్థాన్ ప్రజలు అక్కడకు వస్తుంటారని అన్నారు. ఈ నేపథ్యంలో భద్రతకు సంబంధించిన సమాచారాన్ని నేపాల్ దళాలు తమకు అందిస్తారని వెల్లడించారు.
మరోవైపు భారత్, నేపాల్ మధ్య సుమారు1,700 కిలోమీటర్లకుపైగా సరిహద్దు ఉన్నది. అయితే ఈ సరిహద్దు వెంబడి ఎలాంటి కంచె లేదు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద కదలికలను గమనించడానికి సరిహద్దుకు ఇరువైపులా భారత్, నేపాలీ సైనికులను ఇరు దేశాలు మోహరించారు.