న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: భారతీయ వస్తువులపై భారీ సుంకాలను విధించిన తర్వాత మరో కొత్త రంగంపై సుంకాలు విధించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కనపడుతోంది. ఐటీ సేవలు, విదేశాల్లో ఉండి పనిచేసే టెకీలు, ఔట్‌సోర్సు ద్వారా సాగే వ్యాపార కార్యకలాపాలు తదితర ఐటీ రంగానికి చెందిన సేవలపై ట్రంప్ ప్రభుత్వం సుంకాలు విధించే అవకాశం ఉన్నది.
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ ప్రక్షాళన, గ్రీన్‌కార్డుదారులు, తాత్కాలిక వీసా ఉద్యోగులు పంపించే సొమ్ముపై సుంకం పెంపు వంటి ప్రతిపాదనలను కూడా అమలు చేయడం ద్వారా భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని ట్రంప్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీ, అమెరికాలో ఐటీ బూమ్ మీద ఆధారపడిన ఇంజనీర్లు, కోడింగ్ నిపుణులు, విద్యార్థులతోసహా భారతీయ మానవ వనరులను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అన్ని ఔట్సోర్సింగ్లపై సుంకాలు విధించాలని, వస్తువుల తరహాలోనే అమెరికాకు ఎక్కడో ఉండి సేవలు అందచేస్తూ లాభపడుతున్నందుకు ఇతర దేశాలు మూల్యం చెల్లించుకోవాలని కన్జర్వేటివ్ వ్యాఖ్యాత జాక్ పోసోబీక్ ఎక్స్‌లో పెట్టిన పోస్టుతో ఈ చర్చ ఆసక్తికరంగా మారింది.
విదేశాల్లో ఉండి అమెరికా కంపెనీల కోసం పనిచేసే ఐటీ ఉద్యోగులపై సుంకాలు విధించడం వల్ల అమెరికా కంపెనీలకు ఐటీ, బ్యాక్ ఆఫీసు సర్వీసులు సమకూర్చడంలో ఖర్చు పెరిగిపోయి కాంట్రాక్టులపై సంస్థలు పునరాలోచనలో పడడం, ధరలు పెంచడం లేదా దేశీయంగా ఉద్యోగుల సేవలు పొందడం వంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలు చేపడితే సైప్లె చెయిన్ తెగిపోయి ప్రాజెక్టులు జాప్యం కావడంతోపాటు అమెరికన్ మార్కెట్‌పై పూర్తిగా ఆధారపడిన భారతీయ ఐటీ కంపెనీలకు లాభాల శాతం తగ్గిపోయే అవకాశం కూడా ఉంది.
ఐటీ, సేవల రంగం భారత్ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఏటా లక్షలాదిమంది ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ రంగంలోకి ప్రవేశించి ఐటీ, ఔట్సోర్సింగ్ సంస్థలకు కొత్త నైపుణ్యాన్ని అందచేస్తున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి ప్రముఖ కంపెనీలు హెచ్-1బీ వీసాలను ప్రధానంగా స్పాన్సర్ చేస్తున్నాయి.
దీంతో అమెరికాలో టెకీలు ఉద్యోగాలు పొంది ప్రయోజనం పొందుతున్నారు. అమెరికాకు భారత్ నుంచి భారీ స్థాయిలో ఎగుమతి అయ్యేవి వస్తువులు కాదని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాటా సైంటిస్టులు, కన్సల్టెంట్లు, విద్యార్థులని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంపై సేవా పన్ను విధించిన పక్షంలో అది ఉద్యోగులపైనే కాకుండా భారతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఆర్థిక ప్రభావాల కన్నా అధికంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినిప్రతిభావంతులైన ఉద్యోగుల బదిలీ ఆగిపోయి భారతీయ కంపెనీలు తమ మార్కెట్లను మళ్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
సేవా పన్నులు విధించడంతోపాటు భారతీయ ఐటీ ఉద్యోగులకు ప్రధాన ద్వారమైన వీసాలకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారతీయ ఐటీ ఎగుమతికి వెన్నెముకగా పనిచేసిన హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు, సాంస్కృతిక మార్పిడి సందర్శకులు, విదేశీ జర్నలిస్టుల వీసా గడువును పరిమితం చేయాలనిప్రతిపాదిస్తోం ది. చెల్లింపులపై కూడా అమెరికా ప్రభుత్వం పన్నులు పెంచి ంది. ్రఆర్బీఐ గణాంకాల ప్రకా రం అమెరికా నుంచి అత్యధికంగా భారత్‌కే చెల్లింపులు జరుగుతున్నాయి. 2023-24లో 27.7 శాతం అమెరికా నుంచి వచ్చినవే కావడం గమనార్హం.