న్యూఢిల్లీ, జనవరి 18: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా చేపట్టిన 60 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆనకట్ట నిర్మాణంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. యార్లుంగ్ త్సాంగ్పో(బ్రహ్మపుత్ర) నదిపై నిర్మిస్తున్న ఈ డ్యామ్ ద్వారా చైనా నీళ్లను మళ్లించుకొనే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్తు శాఖ వెల్లడించింది. చైనా ఈ డ్యామ్ ద్వారా నీళ్లను ఆపి అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో వరద పరిస్థితులకు లేదా నీటి కొరతకు కారణమయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధమై ఉందని, నీటి నిల్వ కోసం అరుణాచల్ ప్రదేశ్లో చాలా చోట్ల ఆనకట్టల నిర్మాణాన్ని చేపట్టిందని అధికారులు తెలిపారు.