న్యూఢిల్లీ : కరోనా అనంతరం అన్ని దేశాలు ఖర్చులకు కళ్లెం వేస్తుంటే కాషాయ సర్కార్ జీ20 సదస్సు కోసం ఏకంగా రూ. 4100 కోట్లు ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది. బడ్జెట్ కేటాయింపుల కంటే నాలుగు రెట్లు అధికంగా ఈ సదస్సుపై వెచ్చించడం దుబారాను తలపిస్తోంది.దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సు (G20 Summit Budget) విజయవంతం కోసం అధికారులు, వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు గత కొద్దినెలలుగా విస్తృత ఏర్పాట్లు, సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. జీ20 సదస్సు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముగియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పలు దేశాధినేతలు, ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో ప్రతినిధులు తరలిరావడంతో ఢిల్లీని భద్రతా దళాలు, పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా పలు దేశాధినేతలు హాజరయ్యారు. జీ20 సదస్సు నిర్వహణ కోసం భారత్ ఏకంగా రూ. 4100 కోట్లు వెచ్చించింది. జీ20 ప్రెసిడెన్సీ కోసం 2023-24 బడ్జెట్లో ప్రభుత్వం రూ990 కోట్లు కేటాయించగా వ్యయం ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది.
ఇక గతంలో జీ20 సదస్సు నిర్వహణ కోసం పలు దేశాలు భారత కరెన్సీలో చూస్తే ఎంత ఖర్చు చేశాయో పరిశీలిస్తే ఇండోనేషియా 2022లో సదస్సు నిర్వహణ కోసం రూ 364 కోట్ల ఖర్చు చేసింది. జపాన్ (2019) రూ 2660 కోట్లు, అర్జెంటీనా (2018) రూ. 931 కోట్లు, జర్మనీ (2017) రూ. 634 కోట్లు, చైనా (2016) రూ. 1.9 లక్షల కోట్లు, ఆస్ట్రేలియా(2014) రూ. 2653 కోట్లు, రష్యా (2013) రూ. 170 కోట్లు, ఫ్రాన్స్ (2011) రూ. 712 కోట్లు, కెనడా (2010) రూ. 4351 కోట్లు వెచ్చించాయి. ఇక భారత్ జీ20 నిర్వహణ కోసం మొత్తం 12 విభాగాల్లో రూ. 4100 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వ రికార్డుల ప్రకారం వెల్లడైంది.
Read More :