Kamala Harris | అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris) డ్యాన్స్ చేశారు. వైట్‌హౌస్ (White House)లో ఇటీవలే నిర్వహించిన ఓ కార్యక్రమంలో సరదాగా కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
వైట్‌హౌస్‌లో ఇటీవలే హిప్ హాప్ (Hip-Hop) 50వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమలా హ్యారిస్.. రంగురంగుల చొక్కా, పింక్ కలర్ ప్యాంట్ ధరించి సరదాగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని పొలిటికల్ కామెంటేటర్ (Political Commentator) ఆంథోనీ బ్రియాన్ లోగాన్ (Anthony Brian Logan) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఆ డ్యాన్స్‌ను చూడలేకపోతున్నాం’, ‘ఆమె అచ్చం భామ్మలా డ్యాన్స్ చేస్తోంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Kamala Harris with the granny 👵🏼 moves at her 50th Anniversary of Hip-Hop partypic.twitter.com/8Lg5XCxQ3a
— Anthony Brian Logan (ABL) 🇺🇸 (@ANTHONYBLOGAN) September 9, 2023
Also Read..
Kim Jong Un | విలాసవంతమైన రైల్లో రష్యా చేరుకున్న కిమ్.. పుతిన్‌తో నేడు కీలక భేటీ..?
Morocco Earthquake | 3 వేలకు చేరువలో మొరాకో మృతుల సంఖ్య.. ఎటుచూసినా దయనీయ పరిస్థితే
Libya Floods | లిబియాను ముంచెత్తిన వరదలు.. 2 వేల మందిగిపైగా మృతి, వేలాది మంది గల్లంతు