Kim Jong Un | విలాసవంతమైన రైల్లో రష్యా చేరుకున్న కిమ్.. పుతిన్‌తో నేడు కీలక భేటీ..?
Kim Jong Un | ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) రష్యా (Russia) చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో కిమ్ నేడు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
Kim Jong Un | ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) రష్యా (Russia) చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో కిమ్ నేడు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆయుధ అంశాలపై చర్చల కోసమే ఆయన రష్యాకు వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, పుతిన్‌తో కిమ్ భేటీ ఎప్పుడు, ఎక్కడ అన్నది మాత్రం తెలియరాలేదు. కిమ్ ఆదివారం సాయంత్రమే ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ (Pyongyang) నుంచి విలాసవంతమైన రైల్లో రష్యాకు బయలు దేరినట్లు తెలిసింది.
కాగా, రష్యాకు కిమ్ రావడం ఇది రెండోసారి. 2019లో ఆయన మొదటిసారి ఆదేశాన్ని విజిట్ చేశారు. ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలోని రష్యా నగరమైన వ్లాదివోస్కీలో రష్యా అధ్యక్షుడితో ఆయన భేటీ అయ్యారు. కిమ్ అప్పుడు కూడా ఇలానే విలాసవంతమైన రైల్లో 20 గంటల పాటూ ప్రయాణించారు. ఈ సారి కూడా ఆ నగరంలోనే భేటీ ఉండొచ్చని తెలుస్తోంది. పుతిన్ ఆహ్వానం మేరకు ఆయన క్రెమ్లిన్ వెళ్లినట్లు సమాచారం.
మరోవైపు ఉత్తర కొరియాపై అమెరికా ఆరోపణలు చేసింది. రష్యాకు కిమ్ ఆయుధాలను అందిస్తున్నట్లు అగ్రరాజ్యం పేర్కొన్నది. ప్రైవేటు మిలిటరీ వాగ్నర్ గ్రూపునకు ఉత్తర కొరియా ఆయుధాలు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read..
Morocco Earthquake | 3 వేలకు చేరువలో మొరాకో మృతుల సంఖ్య.. ఎటుచూసినా దయనీయ పరిస్థితే
Libya Floods | లిబియాను ముంచెత్తిన వరదలు.. 2 వేల మందిగిపైగా మృతి, వేలాది మంది గల్లంతు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

