న్యూఢిల్లీ, మార్చి 23: ఉల్లిగడ్డల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. దేశీయంగా ఉల్లిగడ్డల లభ్యత పెంచేందుకు, ధరలు అదుపులో ఉంచే లక్ష్యంతో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. వాస్తవానికి ఉల్లిగడ్డల ఎగుమతిపై విధించిన నిషేధం ఈ ఏడాది మార్చి 31తో ముగుస్తుంది. దీంతో శుక్రవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది.