న్యూఢిల్లీ : తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్న పాకిస్థాన్ హై కమిషన్ అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. అతను 24 గంటల్లో భారత్‌ను విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించినట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణ అనంతరం ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ అధికారి కార్యకలాపాలపై న్యూఢిల్లీలోని పాకిస్థాన్ డీ అఫైర్స్‌కు తెలియజేసింది.