న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి(Vikram Misri) మీడియాకు వివరించారు. పెహల్గామ్ ఉగ్రదాడికి కారణమై వారిని మన ఇంటెలిజెన్స్ గుర్తించిందని, ఆ ఉగ్రమూకల్ని టార్గెట్ చేసినట్లు మిశ్రి వెల్లడించారు. ఉగ్ర స్థావరాలను గుర్తించి, ఉగ్రవాదుల్ని రూపుమాపాని ఆయన పేర్కొన్నారు. విక్రమ్ మిశ్రి మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న ప్రగతి, అభివృద్ధిని ఉగ్రవాదులు టార్గెట్ చేశారని ఆయన అన్నారు. పెహల్గామ్ దాడి పట్ల జమ్మూకశ్మీర్‌తో పాటు యావత్ దేశ ప్రజల్లో సహజంగా ఆగ్రహం వ్యక్తం అయ్యిందన్నారు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసే హక్కును ఇండియా వినియోగించుకున్నట్లు చెప్పారు. పెహల్గామ్ దాడితో కావాలనే కుటుంబసభ్యుల్ని వేదనకు గురి చేశారన్నారు. జమ్మూకశ్మీర్‌లో మత ఉద్రిక్తలు కలిగించే రీతిలో పెహల్గామ్ దాడి జరిగినట్లు ఆయన తెలిపారు.
#WATCH | Delhi | #OperationSindoor| Foreign Secretary Vikram Misri says, “…The attack in Pahalgam was marked with extreme barbarity, with the victims mostly killed with head shots at close range and in front of their family…the family members were deliberately traumatised… pic.twitter.com/UYTYo0D45d
— ANI (@ANI) May 7, 2025