న్యూఢిల్లీ: దేశంలో నిషేధమైన షార్ట్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌ను మళ్లీ యాక్సెస్ చేయగలుగుతున్నామంటూ కొందరు యూజర్లు చేస్తున్న ప్రకటనలను భారత్ ఖండించింది. టిక్‌టాక్ ఇంకా నిషేధంలోనే ఉందని ప్రభుత్వ వర్గాలు శనివారం ధ్రువీకరించాయి. టిక్‌టాక్‌పై విధించిన నిషేధం ఇంకా కొనసాగుతున్నదని, దానిని తాము యాక్సెస్ చేయగలుగుతున్నామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవి ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని స్పష్టం చేశాయి.
టిక్‌టాక్ వెబ్సైట్ కొందరు యూజర్లకు యాక్సెస్ అవుతున్నప్పటికీ లాగిన్ కావడం, వీడియోలను అప్లోడ్ చేయడం, వీక్షించడం కుదరడం లేదు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత భారత ప్రభుత్వం టిక్‌టాక్ సహా పలు చైనా యాప్‌లను నిషేధించింది.