భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. తాజాగా దేశంలో 10,273 కరోనా కేసులు నమోదైటన్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,29,16,117కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 243 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,13,724కు చేరింది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా10,409 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,22,90,921గా నిలిచింది. ఒక రోజులో దేశవ్యాప్తంగా లక్ష కన్నా తక్కువ కేసులు నమోదవడం ఇది వరుసగా 20వ రోజు.
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 0.25 శాతం మాత్రమే. అలాగే కరోనా మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 177.44 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించారు.