న్యూఢిల్లీ : పాకిస్థాన్ విమానాలు మన గగనతలం గుండా ప్రయాణించకుండా నిషేధం విధించాలని కేంద్రం యోచిస్తున్నది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది. ఒకవేళ నిషేధం విధిస్తే ఆగ్నేయాసియా దేశాలైన మలేసియా వంటి వాటికి వెళ్లడానికి చైనా లేదా శ్రీలంక ఆకాశ మార్గాలను పాక్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మరోవైపు పాక్ నౌకలు మన దేశ నౌకాశ్రయాల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని కేంద్రం భావిస్తున్నది. ఇప్పటికే పాక్ తన గగనతలం గుండా భారత విమానాలు వెళ్లకుండా నిషేధం విధించింది.