భువనేశ్వర్: సముద్ర ఆధారిత బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ చేరింది. శత్రుదేశాల బాలిస్టిక్ క్షిపణులను కూల్చేయగలిగే సముద్ర ఆధారిత ఎండో-అట్మోస్ఫెరిక్ ఇంటర్సెప్టార్ బాలిస్టిక్ క్షిపణిని భారత నేవీ, డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించాయి.
శనివారం ఒడిశాలోని బంగాళాఖాత తీరంలో ఈ ప్రయోగం జరిగింది. అత్యంత సంక్షిష్టమైన నెట్వర్క్ సెంట్రిక్ యాంటి బాలిస్టిక్ మిస్సైల్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంలో దేశం స్వావలంబన సాధించిందని డీఆర్డీవో చీఫ్ సమీర్ వీ కామత్ పేర్కొన్నారు.