మాస్కో: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ తన విధానాన్ని మార్చుకుందని భావించడానికి తమకు ఎటువంటి కారణం కనిపించడం లేదని రష్యా స్పష్టం చేసింది. రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా బుధవారం మాట్లాడుతూ రష్యాతోసహా వివిధ దేశాల నుంచి చమురును భారత్ ఎప్పటి నుంచో కొనుగోలు చేస్తున్నదని, ఇప్పుడు చమురును వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని భారత్ చెప్పడంలో కొత్త విషయమేమీ లేదని ఆమె చెప్పారు. ఏ దేశం నుంచైనా చమురును కొనుగోలు చేసే స్వేచ్ఛ భారత్కు ఉందని తెలిపారు.