న్యూఢిల్లీ : దేశంలో ఈసారి ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలు మినహా చాలా చోట్ల సాధారణ స్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ రోజులపాటు వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ర్టాల్లో సాధారణ స్థాయికి మించి 2 నుంచి 4 రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదని స్పష్టం చేసింది.