జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే
కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఓటు హక్కును ప్రమాదంలో పడవేస్తున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై శనివారం ఇండియా కూటమి ప్రతీకాత్మక ‘బహిరంగ అభిశంసన’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆయన ఆ పదవి నుంచి దిగాల్సిందేనని మాక్ పార్లమెంట్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించారు.
- మాక్ పార్లమెంట్ డిమాండ్
- సీఈసీపై బహిరంగ అభిశంసన
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఓటు హక్కును ప్రమాదంలో పడవేస్తున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై శనివారం ఇండియా కూటమి ప్రతీకాత్మక ‘బహిరంగ అభిశంసన’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆయన ఆ పదవి నుంచి దిగాల్సిందేనని మాక్ పార్లమెంట్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించారు. ఇండియా కూటమి ఎంపీలు, పౌరసమాజాల ప్రతినిధులు, ఓటు తొలగింపునకు గురైన కొంతమంది బాధిత పౌరులు హాజరైన ఈ కార్యక్రమంలో సమావేశ మందిరాన్ని పార్లమెంట్ తరహాలో అమర్చారు.
ర్యాలీకి తరలి రండి
జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ఆదివారం రాజధానిలో పెద్దయెత్తున నిర్వహించే ర్యాలీకి తరలి రావాలని నేతలు సమావేశంలో పిలుపునిచ్చారు. సీఈసీని ద్రోహిగా పేర్కొన్న మల్లికార్జున్ ఖర్గే ఆయనపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఇచ్చిన ఆదేశాల ప్రకారమే సీఈసీ ఎన్నికల సంఘాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఓటర్లను అన్యాయంగా తొలగిస్తున్న క్రమంలో సీఈసీపై ప్రజా అభిశంసన నిర్వహించేందుకు ఈ మాక్ పార్లమెంట్‌ను ఏర్పాటు చేసినట్టు మాజీ స్పీకర్ మీరా కుమార్ తెలిపారు.
ఓట్ల తొలగింపు దళిత, అల్పాదాయ వర్గాలపై దాడి
సర్ ప్రక్రియ దేశంలోని పీడీఏ (వెనుకబడి, దళిత, అల్పసంఖ్యాక) వర్గాలపై ప్రత్యక్ష దాడి అని సమాజ్‌వాది పార్టీ ఎంపీ హరేంద్ర మాలిక్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లను తొలగించే లక్ష్యంతో దీనిని అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

