Population | ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా.. కడుపు మంటతో రగిలిపోతున్న చైనా
Population | ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇండియా జనాభా 142.86 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకూ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా రెండో స్థానానికి పరిమితమైంది. ఆ దేశంలో 142.57 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ జనాభా 804.5 కోట్లుగా ఉండగా.. ఇందులో మూడింట ఒకవంతు జనాభా భారత్, చైనాలోనే నివసిస్తున్నది.
Population | ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇండియా జనాభా 142.86 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకూ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా రెండో స్థానానికి పరిమితమైంది. ఆ దేశంలో 142.57 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ జనాభా 804.5 కోట్లుగా ఉండగా.. ఇందులో మూడింట ఒకవంతు జనాభా భారత్, చైనాలోనే నివసిస్తున్నది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని దాదాపు 200 దేశాల్లో 804.5 కోట్ల మంది నివసిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ తెలిపింది. 142.86 కోట్ల జనాభాతో భారత్ తొలి స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. భారత్ కంటే దాదాపు 29 లక్షల తక్కువ జనాభాతో చైనా (142.57 కోట్లు) రెండో స్థానంలో ఉన్నట్టు వివరించింది. ఈ మేరకు జనాభా అంచనాలకు సంబంధించి ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023’ పేరిట బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది.1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలెట్టాక ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా ప్రథమ స్థానంలోకి రావడం గమనార్హం.
చైనాలో తగ్గుదల.. భారత్లో పైపైకి
ప్రపంచంలోని మొత్తం జనాభాలో మూడింట ఒకవంతు జనాభా కేవలం భారత్, చైనాలోనే ఉన్నట్టు నివేదిక అంచనా వేసింది. గడిచిన కొన్నేండ్లుగా చైనాలో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గగా.. భారత్లో ఇది నెమ్మదించినట్టు నివేదిక అభిప్రాయపడింది. గడిచిన ఏడాదిలో భారత్ జనాభాలో 1.56 శాతం పెరుగుదల నమోదైనట్టు లెక్కగట్టింది. భారత్లోని మొత్తం జనాభాలో 68 శాతం 15-64 ఏండ్ల మధ్యవారేనని నివేదిక తెలిపింది. 15-24 మధ్య వయస్కులైన యువత జనాభా 21.5 కోట్లని వెల్లడించింది. సంతానోత్పత్తి రేటు సగటున 2గా లెక్కగట్టింది. ప్రజల సగటు ఆయుర్దాయం పురుషులకు 71 ఏండ్లుగా, మహిళలకు 74 ఏండ్లుగా తెలిపింది.
భారత్లో వయసు వారీగా జనాభా ఇలా.. (అంచనా)
క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యం!
జనాభాలో భారత్ అగ్రస్థానం చేరుకోవటంపై చైనా చౌకబారు వ్యాఖ్యలు చేసింది. ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జనాభా ప్రయోజనాలు క్వాంటిటీ (సంఖ్యా బలం) మీద ఆధారపడవు. క్వాలిటీ (నాణ్యత, సామర్థ్యం) మీద ఆధారపడి ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. ‘చైనా జనాభా 140 కోట్ల పైమాటే. ఇందులో పనిచేసే వారి (శ్రామిక శక్తి) సంఖ్య దాదాపు 90 కోట్లు. మా జనాభా డివిడెంట్ (ప్రయోజనం) అదృశ్యమైపోలేదు. అది వృద్ధి చెందుతూ అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తున్నది’ అని వెన్బిన్ అన్నారు.
- 2050 నాటికి జనాభాపరంగా తొలి 10 స్థానాల్లో ఉండే దేశాలివి
- భారత్, చైనా, నైజీరియా, అమెరికా, పాక్, ఇండోనేషియా, బ్రెజిల్, ఇథియోపియా, కాంగో, బంగ్లాదేశ్.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?





