న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: భారత్ ఎళ్లవేళలా ప్రపంచ సంక్షేమం గురించే ఆలోచిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఏ దేశానికి, ఏ సమాజానికి హాని తలపెట్టాలని చూడదని పేర్కొన్నారు.
సిక్కు గురువు తేగ్ బహదూర్ 400వ జయంతిని పురస్కరించుకొని ఎర్రకోటలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. సిక్కు గురువుల ఆదర్శాలను దేశం పాటిస్తుందని అన్నారు. తేగ్ బహదూర్ త్యాగం ఎన్నో తరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.