Haryana elections : హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి (Independent candidate) నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన నామినేషన్ వేసేందుకు వచ్చిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.
హర్యానాకు చెందిన ఆజాద్ పల్వా అనే వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో ఉచాన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు ఆయన ఎడ్లు, నాగలితో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. తన అనుచరులతో కలిచి వచ్చి నామినేషన్ వేశారు.
#WATCH | Jind: Independent candidate Azad Palwa reached the Uchana SDM office with Ox & Plough to file nominations for the upcoming Haryana elections.
Independent candidate Azad Palwa says, “I congratulate the people of Uchana that today we filed the nomination traditionally-… pic.twitter.com/CUMotKJD22
— ANI (@ANI) September 10, 2024
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను సంప్రదాయ పద్ధతిలో నామినేషన్ దాఖలు చేశానని, ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతానని ఆజాద్ పల్వా ధీమా వ్యక్తం చేశారు.