భరించలేని వార్డు ప్రజలు
పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని దూషణలు భరించలేక వార్డు ప్రజ లు.. ఆమె పంచిన చీరలు, మద్యం సీసాలు, కూల్‌డ్రింక్స్, బొందిప్యాకెట్లను తిరిగి వాపస్ ఇచ్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. ఉప్పల్వాయి గ్రామంలో మొదటి విడుతలో జరిగిన ఎన్నికల్లో రెండో వార్డు నుంచి పోటీ చేసిన ఓ అభ్యర్థిని స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు.
- ఓడిపోయిన అభ్యర్థి పంచిన చీరలు, మద్యం బాటిళ్లు వాపస్ ఇచ్చిన ఓటర్లు
రామారెడ్డి, డిసెంబర్ 25: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని దూషణలు భరించలేక వార్డు ప్రజ లు.. ఆమె పంచిన చీరలు, మద్యం సీసాలు, కూల్‌డ్రింక్స్, బొందిప్యాకెట్లను తిరిగి వాపస్ ఇచ్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. ఉప్పల్వాయి గ్రామంలో మొదటి విడుతలో జరిగిన ఎన్నికల్లో రెండో వార్డు నుంచి పోటీ చేసిన ఓ అభ్యర్థిని స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సదరు అభ్యర్థి పోలింగ్‌కు ముందు తన వార్డులో ఇంటింటికీ చీరలు, మద్యం బా టిళ్లు, కూల్‌డ్రింక్స్, బొందిప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో తన వార్డు ప్రజలు కనిపించినప్పుడల్లా వారిని అసభ్యపదజాలంతో దుర్భాషలాడేవారు.
దీంతో విసిగిపోయిన గ్రామపెద్దలతోపాటు వార్డు ప్రజలు ఓడిపోయిన అభ్యర్థినిని పం చాయతీ ఆవరణకు గురువారం పిలిపించారు. దుర్భాషలాడడం కరెక్ట్ కాదని, తక్షణమే క్షమాపణ చెప్పాలని కొంతమంది పెద్దమనుషులు ఆమెకు సూచించగా, ఆమె ససేమిరా అన్నా రు. దీంతో వార్డు ప్రజలు ‘నీ తిట్లు వద్దు..నీ వస్తువులు మాకొద్దు ..’ అంటూ ఎన్నికల్లో ఆమె పంపిణీ చేసిన చీరలు, బీరు బాటిళ్లు, కల్లు ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్‌ను తీసుకువచ్చి పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై ఉంచారు. వాటిని తీసుకొని వెళ్లాలని ఓడిపోయిన అభ్యర్థికి సూచించగా ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం చోటుచేసుకున్నది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని అభ్యర్థితోపాటు గ్రామస్తులను సముదాయించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రోత భాష ఏందీ రేవంత్.. కరువు, కన్నీళ్లతో బాధపడుతుంటే చిల్లర మాటలతో చిందులా??.. కేటీఆర్ ఫైర్
Sajjanar | పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా తగ్గేది లేదు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
మాల వేసుకుని చెప్తున్న.. కాంగ్రెస్ మళ్లా రాదు!.. సీఎం కరప్షన్‌తో తీవ్రనష్టం.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్ ఫైర్
Harish Rao | మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు.. సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి చిల్లర ప్రసంగంపై హరీశ్‌రావు ఫైర్
Land Scam | మాజీ డీజీపీ భూమికి ఎసరు.. 4.27 ఎకరాల పట్టాభూమి రియల్టర్ పేరు పైకి!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

