న్యూఢిల్లీ, ఆగస్టు1: వాణిజ్య సిలిండర్ ధర రూ.6.5 పెరిగింది. అలాగే విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధర కిలో లీటర్కు 2 శాతం పెంచారు. తాజా పెంపు ప్రకారం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1652.50కి చేరింది. ఏటీఎఫ్ కిలో లీటర్ ధర దేశ రాజధానిలో రూ.1827.34(1.9 శాతం) పెరిగి రూ.97,975.72గా నిలిచింది. గృహావసరాలకు వాడే గ్యాస్ సిలిండర్, డీజిల్, పెట్రోల్ ధరల్లో ఎలాంటి పెంపు లేదు.