న్యూఢిల్లీ : ఢిల్లీలో గాలి కాలుష్యానికి కారణం రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం కారణం కావచ్చునని చెప్పడంపై సుప్రీంకోర్టు సోమవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర కాలుష్య కారకాలను కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యలపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, పంట వ్యర్థాలను తగులబెట్టడం గతంలో కూడా జరిగిందని, కానీ గాలి నాణ్యత ఇటీవలి కాలంలో చూస్తున్నంత తీవ్రంగా పతనం కాలేదని గుర్తు చేశారు.