శుక్రవారం 05 జూన్ 2020
National - Feb 06, 2020 , 02:12:37

తమిళ నటుడు విజయ్‌ ఇంట్లో ఐటీ సోదాలు

తమిళ నటుడు విజయ్‌ ఇంట్లో ఐటీ సోదాలు

చెన్నై, ఫిబ్రవరి 5: ప్రముఖ తమిళ న టుడు విజయ్‌ ఇం ట్లో ఐటీసిబ్బంది బుధవారం సోదా లు జరిపారు. ఓ సినీ నిర్మాణ సంస్థ కార్యాలయం, ఫైనాన్సర్‌, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఈ సోదాల్లో ఫైనాన్సియర్‌ ఇంటి నుంచి ఐటీ సిబ్బంది రూ.25 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సోదాలు జరిగిన సమయంలో విజయ్‌ కడలూరులో సినిమా షూటింగ్‌లో ఉన్నారని, విషయం తెలియగానే ఇంటికి బయలుదేరారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.logo