డెహ్రాడూన్: ఒక డ్రోన్ 30 నిమిషాల్లో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. మారుమూల ప్రాంతానికి కీలక మందులను డెలివరీ చేసింది. కొండ ప్రాంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఈ సంఘటన జరిగింది. రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఒక డ్రోన్ గాల్లోకి ఎగిరింది. గర్హ్వాల్ జిల్లా టెహ్రీలోని ఆరోగ్య కేంద్రానికి క్షయవ్యాధి మందులను సరఫరా చేసింది. క్షయ రోగుల నమూనాలను అక్కడి నుంచి ఎయిమ్స్ హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. కాగా, సాధారణంగా ఈ ప్రాంతానికి ఘాట్ రోడ్డు మార్గంలో చేరేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది. అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆరోగ్య కేంద్రానికి కేవలం అర గంటలోనే డ్రోన్ చేరింది. ట్రయల్ రన్లో భాగంగా గురువారం తొలిసారి డ్రోన్ ద్వారా మందులను సరఫరా చేశారు.
కాగా, ఉత్తరాఖండ్‌లోని సుదూర ప్రాంతాలకు చెందిన రోగులకు డ్రోన్ ద్వారా మందులను సరఫరా చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎయిమ్స్ రిషికేశ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మీనూ సింగ్ తెలిపారు. క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులు డ్రోన్ ద్వారా మందులు పొందే వ్యవస్థను తాము రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల చికిత్స కోసం ఆ రోగులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు. డ్రోన్ ద్వారా మందులను సరఫరా చేసేందుకు తాము చేపట్టిన తొలి ప్రయోగం చాలా విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు పలు రాష్ట్రాల్లో కూడా డ్రోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జమ్ముకశ్మీర్‌లోని మంచు ప్రాంతాల్లో విధులు నిర్వహించే సైనికులకు కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులను డ్రోన్ ద్వారా సరఫరా చేశారు. అలాగే మహారాష్ట్రలోని మారు మూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు కూడా డ్రోన్లను వినియోగించారు.
Watch: Drone Airlifts Medicines In Uttarakhand, Covers 40 Km In 30 Minutes pic.twitter.com/eFUSLD4RGA
— NDTV (@ndtv) February 16, 2023
@aiimsrishi की कार्यकारी निदेशिका प्रो. मीनू सिंह के सहयोग से आज एम्स ऋषिकेश से टिहरी बुराड़ी के लिए ड्रोन द्वारा दवाई भेजने का परीक्षण हुआ। जोकि उत्तराखंड के दूर दराज के क्षेत्र में रहने वाले रोगियों के लिए मददगार होगा। @MoHFW_INDIA @meenusingh4 pic.twitter.com/o91mNkYMJc
— AIIMS RISHIKESH (@aiimsrishi) February 16, 2023