Birthday Chocolates: స్కూల్లో బర్త్‌డే చాక్లెట్లు తిని 21 మంది విద్యార్థులకు అస్వస్థత
Birthday Chocolates: పుట్టిన రోజు సందర్భంగా ఆరో తరగతి అమ్మాయి తోటి విద్యార్థులకు చాక్లెట్లు పంచి పెట్టింది. వాటిని తినగానే విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. సొమ్మసిల్లిపోయారు. సుమారు 21 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
చెన్నై: పుట్టిన రోజు వేడుకల్లో విషాదం జరిగింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో.. ఓ స్కూల్ విద్యార్థిని తన పుట్టిన రోజు సందర్భంగా క్లాస్‌మేట్స్‌కు చాక్లెట్లు(Birthday Chocolates) పంచి పెట్టింది. అయితే ఆ చాక్లెట్లు తిన్న తోటి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 21 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. చక్కరపురంలో ఉన్న పంచాయ్ యూనియన్ పబ్లిక్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఆరవ తరగతి స్టూడెంట్ తన పుట్టిన రోజు సందర్భంగా క్లాస్మేట్సకు చాక్లెట్లు పంచింది. ఆ చాక్లెట్లు తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. కొందరు సొమ్మసిల్లిపోయారు. చాక్లెట్లు తిన్న వెంటనే 11 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆ స్కూల్ టీచర్లు వెంటనే విద్యార్థులను గింజి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు అక్కడ చికిత్స జరుగుతోంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ బాలా గోపాల్ ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. ఈ ఘటన పట్ల దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

