Lemon Sold For Rs. 35,000 | గుడిలో నిమ్మకాయకు వేలం.. రూ.35,000కు కొన్న భక్తుడు
Lemon Sold For Rs. 35,000 | గుడిలో ఒక నిమ్మకాయకు వేలం పాట నిర్వహించారు. ఒక భక్తుడు రూ.35,000కు పాడుకుని దానిని దక్కించుకున్నాడు. (Lemon Sold For Rs. 35,000) తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
చెన్నై: గుడిలో ఒక నిమ్మకాయకు వేలం పాట నిర్వహించారు. ఒక భక్తుడు రూ.35,000కు పాడుకుని దానిని దక్కించుకున్నాడు. (Lemon Sold For Rs. 35,000) తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆచారం ప్రకారం భక్తులు శివుడికి సమర్పించిన నిమ్మకాయలు, పండ్లతోపాటు ఇతర వస్తువులను వేలం వేశారు. ఈ వేలంలో సుమారు15 మంది భక్తులు పాల్గొన్నారు. ఈరోడ్‌కు చెందిన ఒక భక్తుడు ఒక నిమ్మకాయను రూ.35,000కు వేలం పాటలో దక్కించుకున్నాడు.

Tamilnadu Temple
కాగా, వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి దేవుడి ముందు ఉంచి పూజ చేశారు. అనంతరం ఆ నిమ్మకాయను వేలంలో పాడుకున్న వ్యక్తికి అందజేశారు. అయితే ఆలయంలో జరిగే వేలం పాటలో నిమ్మకాయ పొందిన వారు దేవుని ఆశీసులతో ధనవంతులు, ఆరోగ్యవంతులవుతారని ఆ ప్రాంత భక్తుల నమ్మకం. అందుకే వేలంలో నిమ్మకాయను దక్కించుకునేందుకు పోటీ పడతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- auction
- Lemon
- Tamil Nadu
- Temple
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

