న్యూఢిల్లీ: ఢిల్లీ(Delhi)లో ఐఆర్ఎస్ అధికారి కుమార్తెను అత్యాచారం, హత్య చేసిన వ్యక్తిని రాహుల్ మీనాగా గుర్తించారు. 19 ఏళ్ల అతను గతంలో బాధితురాలి ఇంట్లో పని మనిషిగా చేశాడు. అయితే 24 గంటల వ్యవధిలోనే ఆ ఉన్మాది రెండు హత్యలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు రాహుల్ మీనాకు చెందిన విషయాలను పోలీసులు తెలిపారు. మంగళవారం రాజస్థాన్‌లోని అల్వార్‌లో పెళ్లికి హాజరైన రాహుల్.. అక్కడ తన స్నేహితుడి భార్యను రేప్ చేశాడు. అర్జెంట్‌గా వర్క్ ఉందని చెప్పి అతను అక్కడ నుంచి ఢిల్లీకి వచ్చాడు. ఓ సెల్‌ఫోన్‌ను పది వేలకు రాహుల్ అమ్మినట్లు తెలిసింది. ఆ తర్వాత ఢిల్లీకి క్యాబ్‌లో ఆరు వేలకు బేక్ చేసుకుని వెళ్లాడు. కానీ ఆ డబ్బు చెల్లించలేదని తెలుస్తోంది. కైలాష్ హిల్స్ ఏరియాలో ఉన్న బాధితురాలి ఇంటికి వెళ్లిన రాహుల్.. 22 ఏళ్ల సివిల్ సర్వీస్ అభ్యర్థినిని హత్య చేశాడు. బుధవారం తెల్లవారుజామున ఆరున్నర సమయం హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఐఆర్ఎస్ ఆఫీసర్ కుమార్తెను చంపేందుకు నిందితుడు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ వైర్ వాడినట్లు అనుమానిస్తున్నారు.
ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంట్లో గతంలో పనిమనిషిగా చేసిన రాహుల్‌ను నెల క్రితమే వెళ్లగొట్టారు. అయితే ఆ అమ్మాయి పేరెంట్స్ మార్నింగ్ వాక్కు వెళ్తారని తెలిసి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో బిల్డింగ్ మెయిన్ గేట్ వద్ద సెక్యూర్టీ గార్డ్ ఉండరని కూడా అతని తెలుసు. ఇంటికి చెందిన అదనపు తాళం చెవిని పనిమనిషి కోసం షూరాక్లో వదిలి వెళ్తారు. దీని గురించి ముందే తెలిసిన రాహుల్.. ఆ కీ తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత అమ్మాయిపై దాడి చేశాడు. ఫింగర్ ప్రింట్ ఉన్న లాకర్ నుంచి ఏడు లక్షల చోరీ అయినట్లు గుర్తించారు. ఐఆర్ఎస్ ఆఫీసర్ కూతురిని రేప్ చేసి, హత్య చేసిన తర్వాత.. ఆమె మృతదేహాన్ని ఫింగర్ ప్రింట్ వరకు లాక్కుని వచ్చినట్లు తెలుస్తోంది. బయోమెట్రిక్ లాకర్‌ను ఓపెన్ చేసేందుకు ఫింగర్ ప్రింట్ అవసరం కావడం వల్ల .. అమ్మాయి బాడీని స్టడీ రూమ్ నుంచి కింద ఫ్లోర్‌కు లాక్కొచ్చాడు. ఆ తర్వాత అతను దుస్తులు మార్చుకుని వెళ్లిపోయాడు.
ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీని పోలీసులు స్కాన్ చేశారు. మెయిన్ రోడ్డుపై ఆటోరిక్షాను తీసుకున్నాడు. ఆ రిక్షా డ్రైవర్‌ను పోలీసులు విచారించారు. అయితే అతను ద్వారక ప్రాంతంలో ఓ హోటల్ తీసుకున్నాడు. ఆ హోటల్‌ను రెయిడ్ చేసి మీనాను అరెస్టు చేశారు. రాహుల్ మీనాకు క్రిమినల్ మైండ్‌సెట్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.