న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : పాలస్తీనా ఏర్పాటు కోసం ఐక్యరాజ్యసమితిలో పెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు పలికింది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతియుత పరిష్కారం, ‘రెండు దేశాల పరిష్కార మార్గం’ అమలుపై న్యూయార్క్ డిక్లరేషన్‌ను ఆమోదించే తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనూహ్యంగా 142 దేశాల మద్దతు లభించింది.
అన్ని గల్ఫ్ దేశాలు వీటికి అనుకూలంగా ఓటు వేయగా, ఇజ్రాయెల్, యూఎస్, అర్జెంటీనా, హంగేరి, నార్వే, పపువా న్యూ గినియా, టాంగా లాంటి దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. కాగా, గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని 193 సభ్యుల జనరల్ అసెంబ్లీ ఈ సందర్భంగా ఖండించింది.