బెంగళూరు: ఆసియాలో వరస్ట్ ట్రాఫిక్ ఉన్న నగరాల్లో బెంగళూరు టాప్లో నిలిచింది. నగరంలో 10 కిలోమీటర్ల ప్రయాణానికి డ్రైవర్లు సగటున 28 నిమిషాల 10 సెకండ్ల సమయాన్ని వెచ్చిస్తున్నారని టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023 వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం బెంగళూరులో పౌరులు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుపోవడం వల్ల ఏడాదికి 132 గంటల సమయాన్ని అదనంగా వెచ్చించాల్సి వస్తున్నది. ఆసియాలో బెంగళూరు తర్వాత మహారాష్ట్రలోని పుణె నిలిచింది. ఇక్కడ 10 కి.మీ ప్రయాణానికి సగటు సమయం 27 నిమిషాల 50 సెకన్లు పడుతున్నది.