న్యూఢిల్లీ : విదేశాలకు వెళ్లే సమయంలో ఎయిర్‌లైన్స్ విధించే నిర్ధిష్ట లగేజ్ బరువు నిబంధనలను పాటించడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. అయితే ఓ మహిళ లగేజ్‌ను ఎలా మేనేజ్ చేస్తుందో చూపే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ये तकनीक ज़्यादा सामान साथ ले जाने वालों के लिए वरदान साबित हो सकती है 😁 pic.twitter.com/7CZeGVpTJ4
— Shubhankar Mishra (@shubhankrmishra) October 14, 2022
లగేజ్‌ను సమర్ధవంతంగా నిర్ధిష్ట పరిమితిని మించకుండా ఎలా ప్యాక్ చేయాలనేది ఈ వీడియోలో మహిళను చూస్తే ఇట్టే పసిగట్టేయవచ్చు. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ క్లిప్‌లో మహిళ ఓ బ్లాక్ బ్యాగ్‌లో భారీ బ్లాంకెట్‌ను ప్యాక్ చేస్తూ కనిపించింది. బ్యాగ్‌లోపలికి బ్లాంకెట్‌ను పంపిన మహిళ బ్యాగ్‌లో వ్యాక్యూం క్లీనర్ నాజిల్‌ను చొప్పించింది.
ఆపై కొన్ని సెకండ్లలోనే మ్యాజిక్ తరహాలో బ్లాంకెట్ సగం సైజ్‌కు కుదించుకుపోవడం కనిపించింది. అధిక లగేజ్ క్యారీ చేసేవారికి ఈ టెక్నాలజీ మేలు చేస్తుందని పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 94,000 మందికి పైగా వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ఈ ఫార్ములాను తాము తప్పక పాటిస్తామని వారు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.