న్యూఢిల్లీ : ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్ మెకిన నైప్ మనం అసాధ్యమనుకునే పనులను సులభంగా హ్యాండిల్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.
అసలు ఆమె వీడియోల్లో ప్రత్యేకత ఏముందని అడిగే వారికి తాజా వీడియో ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా ముందుకొచ్చింది. స్కైడైవింగ్ చేస్తూ మెకిన నైప్ బర్గర్ టేస్ట్‌ను ఎంజాయ్ చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. తాజా వైరల్ వీడియోలో ప్యాక్ విప్పుతూ ఆమె బర్గర్‌ను తినేయడం కనిపించింది.
గగనతలంలో ఎంచక్కా ఆమె ఉల్లాసంగా కొద్దిపాటి డ్యాన్స్ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ లభించగా పెద్ద ఎత్తున రియాక్షన్స్ వచ్చాయి. పదివేల అడుగుల ఎత్తులో బర్గర్ ఇంకా టేస్టీగా ఉంటుందని ఓ యూజర్ రాసుకొచ్చారు.