న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించాలంటే ఈ ఫోటోను చూస్తే చాలు. ట్రెడిషనల్ కుర్తా, పైజమా ధరించి ఒబామాను పోలిన బొమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
obama’s Diwali party outfit pic.twitter.com/Ny7c1Jl6le
— vibes are ?!?!?!?! (@lilcosmicowgirl) October 18, 2022
ఈ వైరల్ పోస్ట్‌ను ఓ పేజ్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ బొమ్మలో ఒబామా ప్రతిబింబం ఎంబ్రాయిడరీ టాప్, పైజమాతో కనిపిస్తుండగా పోస్ట్‌కు ఒబామాస్ దివాళీ పార్టీ అవుట్‌ఫిట్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఒబామా దివాళీ డ్రెస్ అదిరిందని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.