న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రెండు అంశాల్లో పాపులర్ కాగా.. కాలుష్యం, నాసిరకం వాయు నాణ్యత వీటిలో ఒకటైతే మరొకటి స్పైసీ మోమోస్ అనే చెప్పాలి. ఆవిరి కుడుముల్లో మాంసం పీస్‌లు, కూరగాయల ముక్కలు స్టఫ్ చేసి స్పైసీ చట్నీతో సర్వ్ చేసే మోమోస్‌ను చూస్తేనే నోరూరుతుంటుంది.
అయితే కొరియన్ బ్లాగర్ షేర్ చేసిన మోమోస్ వీడియో మాత్రం దేశీ నెటిజన్స్‌కు షాక్ ఇచ్చింది. ఢిల్లీ షాపింగ్ ప్యారడైజ్ సరోజనీనగర్ మార్కెట్‌ను సందర్శించిన కొరియన్ బ్లాగర్ ఇన్వుక్ ఆ వీడియోను షేర్ చేశారు. ఆ క్లిప్‌లో అతను స్పైసీ చట్నీతో మోమోస్‌ను టేస్ట్ చేయడం కనిపించింది. ఈ పాపులర్ స్నాక్ అతడికి పెద్దగా రుచించినట్టు కనిపించలేదు.
ఈ క్లిప్‌కు ఇప్పటివరకూ 13 లక్షల పైగా వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. మోమోస్ ఇన్వుక్కు నచ్చకపోవడం పట్ల తాము షాక్‌కు గురయ్యామని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. ఎంతో రుచిగా ఉండే మోమోస్ పాపులర్ స్నాక్స్‌లో ఒకటని వారు కామెంట్ చేశారు.