న్యూఢిల్లీ : మనం అసలు ఊహించని వెరైటీ ఫుడ్ కాంబినేషన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఫుడ్ బ్లాగర్ ఆలూ సబ్జీతో జిలేబీని టేస్ట్ చేస్తున్న వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఆలు సబ్జితో జిలేబీని రుచి చూస్తున్న ఫుడ్‌బ్లాగర్ రియాక్షన్ చూసి తీరాల్సిందే. ఈ వైరల్ వీడియోను పాలక్ కపూర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ షార్ట్ క్లిప్‌లో చిరువ్యాపారి కంటెయినర్లో జిలేబీపై ఆలూ కీ సబ్జి పోయడం కనిపిస్తుంది. ఈ విచిత్ర కాంబినేషన్‌ను పాలక్ ఆస్వాదిస్తూ చాలా బాగుందనే ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కనిపిస్తుంది. ఈ ఫుడ్ కాంబినేషన్ మధురలోని ఓమా పెహెల్వాన్లో అందుబాటులో ఉంది. విచిత్రమైన కాంబినేషన్‌ను ట్రై చేశా..మధుర, వృందావన్‌లో ఆలూ కీ సబ్జీతో జిలేబి చాలా ఫేమస్..అందుకే తాను మధురాలోని ఒమా పెహెల్వాన్లో ఈ కాంబోను రుచిచూశానని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకూ 2 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ ఫుడ్ కాంబోపై నెటిజన్లు పెదవివిరుస్తూ కామెంట్స్ సెక్షన్లో విరుచుకుపడ్డారు. అసలు దీన్ని ఎవరు తింటారని ఓ యూజర్ ప్రశ్నించగా, అసలు ఇదేం కాంబినేషన్ అంటూ మరో యూజర్ ముఖం చిట్లించారు.