న్యూఢిల్లీ : తండ్రీ కొడుకుల ఫీట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సీలింగ్‌కు అతుక్కున్న బెలూన్ను తీసుకునేందుకు తండ్రి తన కొడుకును పైకి ఎగరేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. కొందరు నెటిజన్లు ఈ వీడియోను హాస్యం పంచుతుందని రిసీవ్ చేసుకోగా మరికొందరు ఇది అత్యంత ప్రమాదకర రిస్కీ ఫీట్ అని ఆందోళన వ్యక్తం చేశారు.
Don't tell mommy pic.twitter.com/IH09UdaSd8
— Lo+Viral 🔥 (@TheBest_Viral) November 22, 2022
ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 16 లక్షల వ్యూస్ లభించాయి. ఇంటి సీలింగ్‌కు చిక్కుకుపోయిన బెలూన్ను తీసుకునేందుకు తండ్రి తన చిన్నారిని పైకి ఎగరవేస్తుండగా మరో చిన్నారి ఈ తతంగాన్ని గమనిస్తూ కనిపించాడు. బాలుడు బెలూన్‌తో కిందకు రాగానే అక్కడే ఉన్న చిన్నారి పైకి ఎగిరేందుకు ప్రయత్నించారు. ఇది అత్యంత రిస్కీ వీడియో అని బాలుడికి జరగరానిది జరిగితే ఏంటని పలువురు యూజర్లు ప్రశ్నించారు. ఇక ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అని ఓ యూజర్ సైటైర్లు వేశారు.