న్యూఢిల్లీ : బేబీ గొరిల్లా తొలిసారి తండ్రిని కలుసుకున్న ఉద్వేగభరిత వీడియోను (Viral Video ) ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్లో షేర్ చేశారు. నెట్టింట ఈ వీడియో తెగ వైరలవుతుండగా ఇప్పటివరకూ ఈ క్లిప్‌ను 64,000 మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోలో పిల్ల గొరిల్లా తన తండ్రి ముఖాన్ని మెల్లిగా తడుముతూ గుర్తించేందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది.
Baby Gorilla meets the Father for the first time💕 pic.twitter.com/bLOf0892jE
— Susanta Nanda (@susantananda3) May 7, 2023
బేబీ గొరిల్లా తొలిసారి తండ్రిని కలిసిందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. కామెంట్స్ సెక్షన్ పూర్తిగా హార్ట్, లవ్ ఎమోజీలతో నిండిపోయింది. న్యూరోసర్జన్ భార్యగా నా పిల్లలు తండ్రితో మెలిగే తీరు నాకు తెలుసు..ఇది కూడా అలాగే ఉందని అని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More